ప్రాంతీయం

బీసీ రిజర్వేషన్ 42శాతం చేశాకనే ఎన్నికలు సురువు చేయాలి…

25 Views

 ముస్తాబాద్, జనవరి 30 ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని తెలంగాణతల్లి విగ్రహంవద్ద శీలంస్వామి ఆద్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను అమలు చేయాలని, రాబోయే ఎన్నికలను 42శాతం రిజర్వేషన్లు బీసీలకు సురువు పిదప సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని మరియు బీసీ డిక్లరేషన్ లో పొందుపరిచిన ఇతర సంక్షేమ, అభివృద్ధి అంశాలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇదేవిధంగా బీసీలను చిన్నచూపు చూస్తే బీసీ మేధావులను, ఉద్యోగులను, నిరుద్యోగులను, రైతులను, కార్మికులను, కర్షకులను కలుపుకొని పెద్ద మొత్తంలో రాష్ట్రవ్యాప్త బీసీ ఉద్యమానికి శ్రీకారం చుడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు మెంగని మనోహర్, కంచం నర్సింలు, పుల్లూరి శ్రీనివాస్, కోడె శ్రీనివాస్, పర్శరాములు, శేఖర్ చారి, బాలేల్లు, రాజు, మహేష్, వెంకటేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్