సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అల్పాహార పంపిణీ కార్యక్రమం మంగళవారం 4వ సంవత్సరం 29వ రోజుకు చేరుకుంది కార్తిక మాసం సందర్భంగా ఈరోజు నుండి 20వ తేదీ వరకు నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నంగునూరి సత్యనారాయణ, విజయలక్ష్మి దంపతుల సౌజన్యంతో అల్పాహార పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు, అల్పాహారంతో పాటు ఈరోజు మర్కుక్ మండలం చేబర్తి గ్రామానికి చెందిన ఎర్రబాగు రఘుపతి శ్యామల పెద్ద కుమారుడు సాయి కుమార్ పుట్టిన రోజు సందర్భంగా సాయి కుమార్ జ్ఞాపకార్థం అన్నదానం, అరటి పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని సమాజసేవలో ముందు వరుసలో ఉంటున్న లయన్స్ క్లబ్ పలువురికి ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు, అలాగే చిన్న వయసులోనే సాయి కుమార్ మరణించడం బాధాకరమని వారి జ్ఞాపకార్థం తన పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు ప్రభుత్వ దవాఖాన లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్, లయన్ దొంతుల సత్యనారాయణ, నయిం షరీఫ్, రాజు ,నరేందర్ రెడ్డి, వంశీ, గ్యార నవీన్,ఉపేందర్,తదితరులు పాల్గొన్నారు.
