● చిత్రించి భక్తిని చాటుకున్న రామకోటి రామరాజు
● 1984వ సంవత్సరం నాటి అరుదైన పది పైసలు
● ఆనాటి పాతనాణాలు అమ్మ రూపంలో చూసి తరించామన్న భక్తులు
దుర్గాదేవి శరన్నవరాత్రులు పురస్కరించుకుని కంటికి కనిపించని ఆనాటి అరుదైన 1984 నాటి పది పైసలను ఉపయోగించి ఆధ్యాత్మిక కళానైపుణ్యంతో అమ్మవారి అద్భుత రూపాన్ని రూపొందించి మంగళవారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి భక్తిని చాటుకున్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యకులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు
ఈ సందర్బంగా మాట్లాడుతూ అలనాటి పది పైసలు ఇప్పుడు చూద్దామన్న దొరకవు కాబట్టి అమ్మ వారి చిత్రం రూపంలో చూస్తున్నమన్నారు. ఈ అరుదైన పది పైసల సేకరింకచడం శ్రమతో కూడుకున్న పని అన్నారు. అమ్మ దయతోనే సేకరించి అమ్మ వారి చిత్రాన్ని వినూతనంగా వేశానన్నారు. అమ్మదయ ఉంటే ప్రపంచంలో సాధించానిది ఏదీ లేదన్నారు.
భక్తులు తిలకించి ఎప్పుడో ఈ నాణాలను చూశామని ఇప్పుడు రామకోటి రామరాజు చిత్రించిన ఈ చిత్రంలో ఇప్పుడు చుస్తున్నామని ఆనందాన్ని వ్యక్తపరిచి అభినందించారు.
