ఆధ్యాత్మికం

హరేరామ నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొన్న వంగపల్లి అంజయ్య స్వామి

140 Views

 

భగవన్నామ స్మరణతోనే మానవునికి ముక్తి లభిస్తుందని ఆధ్యాత్మిక జాతీయ అధ్యక్షులు వంగపల్లి అంజయ్య స్వామి అన్నారు సిద్దిపేట జిల్లా జగదేవపూర్ పట్టణ కేంద్రంలో బుధవారం మాఘ శుద్ధ ఏకాదశి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర దేవాలయం వద్ద పాండురంగ ఆశ్రమం వారిచే నిర్వహించబడుతున్న హరే రామ నగర సంకీర్తన కార్యక్రమాన్ని అంత్యంత భక్తి శ్రద్ధలతో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు హరే రామ నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది హరే రామ నగర సంకీర్తన అఖండ భజన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వంగపల్లి అంజయ్య స్వామి మాట్లాడుతూ మానవజన్మ సార్థకానికి దైవ నామస్మరణమే ఏకైక మార్గమని దైవారాధన తోనే ముక్తి లభిస్తుందని పాండురంగ ఆశ్రమం వారు చేపట్టిన హరే రామ నగర సంకీర్తన గొప్ప కార్యక్రమమని ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించిన జగదేవపూర్ మండల ఆర్యవైశ్య సంఘం వారిని అభినందించారు, హరే రామ నగర సంకీర్తన అనంతరం జగదేవపూర్ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వంగపల్లి అంజయ్య స్వామికి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈసందర్భంగా జగదేవపూర్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్, సీనియర్ నాయకులు బుద్ద మహేందర్, కొండలు గుప్తా మాట్లాడుతూ రేణుకా ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు వంగపల్లి అంజయ్య స్వామి ప్రజలను భక్తి మార్గం వైపు వెళ్లే విధంగా కృషి చేస్తూ సమాజ సేవలో ముందు వరసలో ఉంటూ అధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి మంగళ వారం రేణుకా ఎల్లమ్మ దేవాలయం వద్ద అన్నదానం నిర్వహిస్తున్నారని వీరి సేవలు గుర్తించి ఇటీవల భక్తి రత్న అవార్డు,తమిళనాడు లో డాక్టరేట్ అవార్డు స్వీకరించి సందర్భంగా వంగపల్లి అంజయ్య స్వామికి చిరు సన్మానం చేయడం జరిగింది అని అన్నారు ఈకార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు యువకులు,మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *