ప్రాంతీయం

మంచిర్యాలలో వందే భారత్ రైలు హాల్టింగ్ ఇవ్వండి

67 Views

మంచిర్యాల జిల్లా

వందే భారత్ రైలుకు మంచిర్యాల రైల్వే స్టేషన్ లో   హల్డింగ్ ఇవ్వాలి   :నడిపెల్లి విజిత్ కుమార్.

వందే భారత్ రైలుకు మంచిర్యాల రైల్వే స్టేషన్లో హాల్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం రైల్వే స్టేషన్ మేనేజర్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ మాట్లాడుతూ వందే భారత్ రైలుకు ఇక్కడ హాల్టింగ్ ఇవ్వడం వల్ల రైల్వే శాఖకు భారీగా ఆదాయం సమకూరడమే కాకుండా ఈ ప్రాంత వాసులకు సౌకర్యంగా ఉంటుంది,అలాగే వందే భారత్ రైలు మంచిర్యాలలో హాల్టింగ్ కాకపోవడం తెలంగాణలో ఉన్న కేంద్ర మంత్రుల,మరియు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాదే పూర్తి బాధ్యత , అలాగే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులది కూడా అని అన్నారు.

అనంతరం మేనేజర్ కి వినతిపత్రం అందజేసి వందే భారత్ రైలు మంచిర్యాలలో హాల్టింగ్ అవ్వడానికి కృషి చేయాలని మేనేజర్ ని కోరడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్