ప్రాంతీయం

తక్షణమే బస్సుసౌకర్య కల్పించాలని వినతిపత్రం. బాధనరేష్…

153 Views

ముస్తాబాద్ సెప్టెంబర్ 13 (24/7న్యూస్ ప్రతినిధి): సిరిసిల్ల నియోజకవర్గాన్ని ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామానికి బస్సు అనుమతించాలని ముస్తాబాద్ మండల బిజెపి ప్రధాన కార్యదర్శి బాధ నరేష్ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఆర్టీసీ సిరిసిల్ల మేనేజర్ ఏ. ప్రకాష్ రావు కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బాధ నరేష్, సీనియర్ బిజెపి నాయకులు శ్రీనివాస్ రావు చీకోడు గ్రామానికి గత 35 మందికి పైచిలుకు బస్సు సౌకర్యం ఉండేదని కనీసం ఉదయం సాయంత్రం సమయాలలో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు, పాఠశాలకు సమయానికి చేరుకోలేక ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులకు బస్సు సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చే ఉచిత బస్సు సౌకర్యం ఆరు గ్యారెంటీలలో భాగంగా ప్రజలు, ఉచిత బస్సు ప్రయాణం వినియోగించేందుకు ఉపయోగపడుతుందని తెలపారు. తక్షణమే బస్సు సౌకర్యం కల్పించడానికి డిపో మేనేజర్ ను కలిగి ఉన్నారు. వినతి పత్రం అందించిన వెంటనే డిపో మేనేజర్ స్పందించి రూటును పరిశీలించి బస్సు సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్