ప్రాంతీయం

అమర జవాన్ శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉంటాం – శ్రీనివాస్

41 Views

దేశ సరిహద్దు భద్రత కోసం, కుటుంబానికి, బంధుమిత్రులకి అందరికీ దూరంగా ఉంటూ సేవ చేసే సైనికులకు ఏదైనా జరుగుతే సభ్య సమాజం మొత్తం వారి కుటుంబాలకు అండగా ఉండాలని రాష్ట్ర సైనిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామానికి చెందిన జవాన్ శ్రీనివాస్ ఇటీవల అనారోగ్య కారణం చేత మృతి చెందిన విషయం తెలుసుకొని సొసైటీ సభ్యులతో కలిసి శ్రీనివాస్ ఫోటోకి పూలమాల అర్పించి వారికి నివాళులు అర్పించడం జరిగింది. గుండారం శ్రీనివాస్ జీవించిన కాలంలో సగభాగం కంటే ఎక్కువ ఈ దేశం కోసమే సర్వీస్ చేశారని, ఆర్మీలో అతి కష్టంగా భావించే పారా కమాండో కోర్సు చేయడం ఈ జిల్లాకే గర్వకారణమని తెలిపారు. భౌతికంగా శ్రీనివాస్ జీవించి లేకపోయినా వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండదండగా ఉంటామని భరోసా కల్పించారు. అలాగే బిజెపి జిల్లా ఎక్స్ ఆర్మీ సెల్ కన్వీనర్ నీల చంద్రం మాట్లాడుతూ మరణించిన జవాన్ శ్రీనివాస్ కుటుంబానికి దేశభక్తితో కూడిన మానవతావాదులు అందరూ అండగా నిల్వలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా సైనిక్ వెల్ఫేర్ తదితరులు ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka