ప్రాంతీయం

భారతీయ కిసాన్ సాంగ్ మండల అధ్యక్షులుగా ఉపేందర్ రెడ్డి

52 Views

రాయపోల్ మండల భారతీయ కిసాన్ సంగ్ అధ్యక్షులుగా మండల కేంద్రంలో చెందిన గల్వ ఉపేందర్ రెడ్డిని ఎన్నుకున్నట్లు ఆ సంఘం జిల్లా శాఖ అధ్యక్షులు కూరెల్లి జస్వంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం మండల కేంద్రంలో నూతన కమిటీని ప్రకటించారు. అధ్యక్షులుగా ఉపేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా జీడిపల్లి బాల్ రెడ్డి, కార్యదర్శిగా సోమని ఇస్తారితో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులుగా ఎన్నికైన ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ పేతురు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి ఆపద సంపద వచ్చిన భారతీయ కిసాన్ సాంగ్ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించే వరకు పోరాడుతామని పేర్కొన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు ఎలాంటి కష్టాలు లేకుండా వారి సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని ఆయన కోరారు. తనపై నమ్మకం ఉంచి మండల భారతీయ కిసాన్ సాంగ్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన జిల్లా భారతీయ కిసాన్ సంగ్ అధ్యక్షులు జస్వంత్ రెడ్డికి రాష్ట్ర నాయకత్వానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంగ్ మహిళా నాయకురాలు గాడి పల్లి అరుణ, మామిడిపల్లి రేణుక తదితరులు పాల్గొన్నారు. కాగా ఎన్నికల అధికారులుగా మహేందర్ రెడ్డి శేఖర్ గౌడ్ తదితరులు వ్యవహరించారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka