గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ నూతన వ్యాయామ శాలను ప్రారంభించారు. ఏఏఆర్ ప్రభుత్వ స్టేడియం అబివృద్ది కమిటీ ఆధ్వర్యంలో వ్యాయామశాలను ఏర్పాటుచేయడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో వేగూరు రాజేంద్రప్రసాద్, స్టేడియం అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
