ప్రాంతీయం

కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన బిజెపి పార్టీ

47 Views

*భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కోడి రమేష్  జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.*

*కోడి రమేష్*  మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ల సభలో ఎస్సీ డిక్లరేషన్ పేరుతో అబద్ధపు మాటలు చెప్పి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఎస్సీ డిక్లరేషన్ మరిచిపోయారు.

*అంబేద్కర్ అభయ హస్తం కింద ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలి.*
*ప్రతి ఎస్సీ కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయాలి.*
*ఎస్సీ ఉప కులాలకు మాల మరియు మాదిగ కార్పొరేషన్లకు సంవత్సరానికి రూ 750 కోట్లు కేటాయించాలి.*
*ఎస్సీ హాస్టల్స్ పునర్ నిర్మాణానికి అవసరమైన నిధులు వెంటనే కేటాయించాలి.*
*ఎస్సీ కార్పొరేషన్ ద్వారా యువతకు స్వయం ఉపాధికై సబ్సిడీ రుణాలకు సంవత్సరానికి రూ 1000 కోట్లు కేటాయించాలి.*
లేనియెడల బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకొని ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేంతవరకు పోరాడుతామని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి మొగిలి. జిల్లా కార్యదర్శి నాగుల రాజన్న. ఎస్సీ మోర్చా మంచిర్యాల పట్టణ అధ్యక్షులు దేవరకొండ వెంకన్న. ప్రధాన కార్యదర్శి జాడి నరేందర్. ఎస్సీ మోర్చా నస్పూర్ పట్టణ అధ్యక్షులు సిరికొండ రాజు. ప్రధాన కార్యదర్శి తరళ్ళ విజయ్. ఎస్సీ మోర్చా లక్షట్ పేట మండల అధ్యక్షులు చంద్రయ్య. మద్దెల నరేష్. మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్