సిద్దిపేట జిల్లా, ములుగు మండలం, ములుగు గ్రామానికి చెందిన బుడిగే రాజమ్మ గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి మృతురాలు కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయంగా 10000 రూపాయలు అందజేశారు. వారితోపాటు శ్రీనివాస్ గౌడ్, తూర్పుంటి లక్ష్మణ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
