ప్రాంతీయం

మంచిర్యాలలో రుణమాఫీ పై ధర్నా చేసిన టిఆర్ఎస్

85 Views

*రుణమాఫీ పై మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు  ఆధ్వర్యంలో ధర్నా*.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా అందరు రైతులకు రుణమాఫీ అమలు చేయాలని , అలాగే రైతు భరోసా కింద 15 వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయాలి ,అంతేకానీ రైతు రుణమాఫీ పై కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులందరూ తలా తోక లేని విధంగా మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రైలందరికి రుణమాఫీ కావాలంటే 40 వేల కోట్ల రూపాయలు కావాలన్నారు, ఎస్ఎల్బీసీ లో చెప్పింది 49 వేల 500 కోట్ల రూపాయలు కావాలన్నది, తర్వాత క్యాబినెట్ లో చెప్పింది 30 వేల కోట్లు, బడ్జెట్లో చెప్పింది 26 వేల కోట్లు, తీరా చూస్తే మొన్న ప్రకటించింది 17900 కోట్లు, కానీ ఇప్పటిదాకా రైతులకు చేరింది కేవలం 7500 కోట్ల రూపాయలు మాత్రమే ముందు చెప్పిన లెక్క ప్రకారం 70 లక్షల రైతులకు రుణమాఫీ చేయాలి కానీ 17934 కోట్ల రూపాయలతో 22 లక్షల రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు అని చెప్తున్నారు, కానీ మిగతా రైతుల పరిస్థితి ఏంటి అని వారు అన్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు, లేదంటే రానున్న రోజుల్లో రైతుల పక్షాన పోరాడుతామని డిమాండ్ చేసిన *మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు*

ఈ కార్యక్రమం లో *బిఅర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్* ,మంచిర్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ పెంట రాజయ్య , మంచిర్యాల పట్టణం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గాదె సత్యం ,మరియు అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొనడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్