దౌల్తాబాద్: ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం పేదలకు ఒక వరమని జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మీ లు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని దీపాయం పల్లి గ్రామంలో సర్పంచ్ లావణ్య నర్సింహారెడ్డి తో కలిసి కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదరికంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంతోమంది కళ్ళలో ఈ కార్యక్రమం వెలుగులు నింపుతుందన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అంధత్వ నివారణకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు శిబిరాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి నాగరాజు, నాయకులు ఇప్ప దయాకర్, చిక్కుడి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు..
