రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ట్రాక్టర్ బోల్తా కొట్టి ఒకరు మృతి చెందారు.స్థానికుల వివరాల ప్రకారం మండలంలోని నర్మల గ్రామానికి చెందిన దండుగుల శ్రీనివాస్(45) అనే వ్యక్తి మంగళవారం పొలం పనులు చేస్తున్నాడు. గ్రామంలో పని ఉందంటూ ట్రాక్టర్ను తీసుకొని వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు.
