ఆధారాలు గుర్తుపట్టకుండా ఆమె నివాసం ఉంటున్న గుడిసెలో కారంపొడి చల్లిన హంతకులు
ఎల్లారెడ్డిపేట మార్చి 09 ;
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్ పెళ్లి గ్రామంలో వివాహిత దారుణ హత్యకు గురైంది ,
శుక్రవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న మహిళ తెల్లవారేసరికి హతమైంది,
స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి వన్ పల్లి గ్రామానికి చెందిన శివరాత్రి మల్లవ్వ ( 42 ) అనే వివాహిత భర్త అనారోగ్యంతో మరో గ్రామంలో ఉంటున్నాడు పెద్ద కుమారుడు రాజు నవంబర్ 2022లో ఇసుక ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటనలో తంగళపల్లి మండలంలో మరణించాడు, రెండో కుమారుడు శేఖర్ ప్రస్తుతం ట్రాక్టర్ డ్రైవర్ గా మరో గ్రామంలో జీవిస్తున్నాడు పూరి గుడిసెలో ఒంటరిగా ఉంటున్న మల్లవ్వ రోజు మాదిరిగానే అన్నం తిని తన గుడిసెలో నిదుర పోయింది కానీ శనివారం ఉదయం ఆమె రక్తపు మడుగులో గ్రామస్తులకు కనిపించింది గుర్తు తెలియని వ్యక్తులు ఆమె గొంతు కోసి దారుణంగా హత్య చేశారు,
ఆధారాలు గుర్తుపట్టకుండా ఆమె నివాసం ఉంటున్న గుడిసెలో మొత్తం కారంపొడి చల్లారు,
సమాచారం అందుకున్న సిరిసిల్ల డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి, సిఐ శ్రీనివాస్ గౌడ్ వీర్నపల్లి ఎస్సై రమేష్ సంఘటన స్థలానికి చేరుకొని హత్య జరిగిన తీరును పరిశీలించారు,
కేసు నమోదు చేసి మల్లవ్వను ఎవరు హత్య చేశారు ఆమెను హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే వివరాలకు గ్రామస్తుల ద్వారా సేకరిస్తున్నారు,
అయితే శుక్రవారం సాయంత్రం ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమె ఇంటి అడ్రస్ అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ద్వారా అడిగి వారు తెలుసుకున్నట్లు గ్రామంలో గ్రామస్తులు చర్చించుకుంటున్నారు , ఇద్దరు వ్యక్తులు కలిసి మల్లవ్వ ను హత్య చేసి ఉండవచ్చునని గ్రామస్తులు పోలీసులు అనుమానిస్తున్నారు,
దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు,
