ముస్తాబాద్, జూలై 8 (24/7న్యూస్ ప్రతినిధి): కేంద్రం హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ ను మండల అధ్యక్షులు మేర్గుఅంజగౌడ్ ఆధ్వర్యంలో కలిసిన చికోడు గ్రామస్తులు.
చీకోడు గ్రామంమీదుగా రేకులకుంట మల్లికార్జున స్వామి దేవాలయంవరకు రోడ్డుగుంతలతో కూడిన మట్టిరోడ్డు ఉండడంచేత భక్తులకు అసౌకర్యంగా ఉందన్నందున తారురోడ్డు మంజూరు జారీ చేయాలని మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాధ నరేష్, కోటగిరి దేవేందర్, గన్నాల రమేష్ గౌడ్, ఊరడి రాజు, సుధాకర్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.




