ప్రాంతీయం

మండల ప్రజల ఆశీస్సులతో మళ్లీగెలిస్తా సైనికుడిలా సేవలందిస్తా…

153 Views

ముస్తాబాద్, ఏప్రిల్ 4 (24/7న్యూస్ ప్రతినిధి): ఎంపిటిసిల పదవిని ముగియడంతో స్థానిక ముస్తాబాద్ ఎంపీటీసీగా విధులు నిర్వహించి గడిచిన కాలానికి అనుగుణంగా పదవి బాధ్యతలు చేపట్టిన కాల పరిమితి ముగియడంతో గుండెల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నేటితో మండల ప్రజాపరిషత్ కు మీఅందరిపక్షాన ప్రాతినిథ్యం వహించి ముస్తాబాద్ లో ప్రశ్నించే గొంతునయ్యాను. మీరిచ్చిన బాధ్యతను విధేయత, కృతజ్ఞత భావంతో భయభక్తి శ్రద్ధలతో ఉన్నంతలో నెరవేర్చేందుకు నేను నాసాయశక్తుల శ్రమించి పాటుపడినాను.   మీఅందరి కళ్లముందున్న ఎంపీటీసీ సభ్యుడిగా ఎన్నో అనుభవాలు జ్ఞాపకాలతో ఐదేళ్ల కాలవ్యవధి నేటితో ముగుస్తున్నందున గడిచిపోయిన వర్తమాన కాలమును దృష్టిలో ఉంచుకొని గడుస్తున్న భూత కాలాన్నీ అనుసరించి భవిష్యత్ కాలంలోనికీ మండల ప్రజల ఆజ్ఞానుసారం చేరుకోవాలని ఆశిస్తున్నాను. మీతో నాఆత్మీయ అనుబంధం జీవితకాలం ఉండాలని స్వచ్ఛమైన మనసుతో కోరుకుంటున్నాను అని తెలిపారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్