భక్తిరత్న జాతీయ పురస్కారాన్ని తల్లిదండ్రులకు అంకితమిచ్చి
తన ప్రేమను చాటుకున్న రామకోటి రామరాజు
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి,(జులై 2)
సిద్దిపేట జిల్లా గజ్వేల్:
25 సంవత్సరాల నుండి చేస్తున్న అధ్యాత్మిక కృషి పట్టుదలకు గాను భక్తిరత్న జాతీయ పురస్కారం పొందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు తన జన్మకు కారణమైన కన్న తల్లిదండ్రులకు అంకితమిచ్చాడు.
ఈ సందర్బంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ నేను ఉన్నత శిఖరాలకు ఎదిగానంటే దానికి మూల కారణం నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే అని అన్నారు. ఎన్ని కష్టాలోచ్చిన రామనామాన్ని వదలకు అని ఉపదేశించిన నా మొదటి దైవాలు నా తల్లిదండ్రులే అన్నారు. అందుకే ఈ భక్తిరత్న జాతీయ పురస్కారం నా తల్లిదండ్రులకే అంకితం అన్నారు. అనంత్తరం తన కుటుంభ సభ్యులతో భక్తిరత్న వచ్చిన సందర్బంగా ఆనందాన్ని పంచుకున్నారు. ప్రొద్దున లేవగానే నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి పనులు ప్రారంభిస్తానని తల్లిదండ్రుల ఆశీస్సులు ఉంటే ప్రపంచంలో సాధించనిది ఏది లేదన్నాడు. కనిపించే దైవాలు తల్లిదండ్రులే అన్నారు.
