-కాంగ్రెస్ సొంత గూటికి చేరుకున్న బిఆర్ఎస్, బీజేపీ నాయకులు
– కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇల్లంతకుంట బీఆర్ఎస్, బీజేపి నాయకులు వారిని కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి…
పార్టీలో చేరిన వారిలో ఇల్లంతకుంట మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య ,సీనియర్ నాయకులు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి,కేశవరెడ్డి జవారిపేట సర్పంచ్ అన్నాడి కరుణ రవీందర్ రెడ్డి, పెద్దలింగాపూర్ ఎంపీటీసీ కరివేద స్వప్న కరుణాకర్ రెడ్డి, రేపాక ఎంపీటీసీ కథ సుమలత మల్లేశం, మాజీ సర్పంచ్ యాదగిరి గౌడ్, సింగల్ విండో డైరెక్టర్ చల్ల నవీన్ రెడ్డి, కేతిరెడ్డి నవీన్ రెడ్డి, శరత్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సుమంత్ రెడ్డి,కందికట్కూర్ గ్రామ నాయకులు భూమల్ల మల్లయ్య,రోషాలు, మల్లేశం తదితరులు నాయకులు ఉన్నారు.
కార్యక్రమంలో బెజ్జంకి మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్, ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షులు రాఘవరెడ్డి బెజ్జంకి మండల అధ్యక్షులు రత్నాకర్ రెడ్డి నాయకులు రాజేందర్ రెడ్డి,పసుల వెంకట్,చందు, సాగర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు




