ప్రభుత్వం సకాలంలో పెన్షన్లు అందించాలి
. ఎమ్మెస్ ఎఫ్ ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు
జాలని బలరాం మాదిగ
సిద్దిపేట జిల్లా:
దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సేవకుడిగా ఇంటింటికి పెన్షన్ లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వo వల్ల రాష్ట్రనికి ఆర్థిక భారం ఉన్నప్పటికిని మంద కృష్ణ మాదిగ డిమాండ్ మేరకు వృద్ధులు,వితంతువులు,వికలాంగుల ప్రక్షాళ దిన జనాభాంధవుడుగా ప్రస్తుత పరిస్థితుల్లో ఆదుకోవడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెస్ ఎఫ్ ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు,ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు జాలని బలరాం మాదిగ అన్నారు.తెలంగాణ ప్రభుత్వం మాత్రం గత ఏడు నెలలుగా లబ్ధిదారులకు సకాలంలో పెన్షన్ ఇవ్వకపోవడం చాలా దారుణమని,ఇకనైనా సీఎం రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి,సకాలంలో పెన్షన్స్ అందించాలని,తన ఎన్నికల ముందు చేసిన వాగ్దానం ప్రకారం అన్ని రకాల పెన్షన్స్ పెంచాలని విజ్ఞప్తి చేస్తూ, డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు.
