చెంచు మహిళపై మానవ మృగాలు చేసిన హింసకు ఖండిద్దాం.
. డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి
నాగర్ కర్నూల్:
చెంచు మహిళ ఈశ్వరమ్మపై అత్యంత అమానవీయంగా హింసించి,అత్యాచారం చేసి హత్యచేయడానికి కృరమృగాల మాదిరిగ సబ్యసమాజం తలదిందుకునే విధంగా నాగర్ కర్నూల్ జిల్లా మూల చింతలపల్లి గ్రామానికి చెందిన దుర్మార్గులు తన ఉన్న భూమిని కాజేయడానికి ఆమె ను అత్యంత కృరంగా ప్రవర్థించిన నీచులపై చట్టపరమైన చర్యలు తిసుకొని కఠినాతి కఠినంగా శిక్షించాలని గురువారం నాడు ఒక ప్రకటనందు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఏగొండ స్వామి మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన చెంచు మహిళకు ఉన్న భూమిని గుంజుకొవడానికి దుర్మార్గంగా ఆమెను వివస్త్రను చేసి వారికి ఇష్టమున్నపద్దతిలో వాడుకొని ,పెట్రొల్ పొసి నిప్పంటించి అధారాలు లేకుండా ప్రాణం తీయడానికి ఒడిగట్టిన ఉన్మాదులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమం లో చంద్రం,సత్తయ్య పాల్గొన్నారు.
