ప్రతాప్ రెడ్డి ఓ పిచ్చోడు పిచ్చిపిచ్చి మాట్లాడుతూ తిరుగుతున్నాడు
-కెసిఆర్ ఓడిపోతే పథకాలు బంద్ అయితాయంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు
-2018 ఎన్నికల్లో కెసిఆర్ ను ఓడించాలని హరీష్ రావు డబ్బులిచ్చాడన్న ఆరోపణ నిజం కాదా
– గుళ్లో ప్రమాణం చేస్తానన్న ప్రతాప్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నాడు
-వాళ్ల నాయకుడు హరీష్ రావే ఆయన మానసిక పరిస్థితి బాగోలేదు అంటున్నారు
-గజ్వేల్ ప్రజలకు పిచ్చోనితో ఏం లాభం లేదని అంటున్నారు.
-ప్రతాప్ రెడ్డి ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీ ఓడిపోతూ వస్తుంది టిడిపి కాంగ్రెస్ ఇప్పుడు బిఆర్ఎస్ వంతు
-ఒక్క ఇంటి వెలుమాయిన గెలవన్న
లక్షల ఓట్లున్న బహుజనుడు గెలవాన్న ఆలోచించండి
గజ్వేల్ 09 నవంబర్ గజ్వేల్ పట్టణం లో బిజెపి నాయకులు కప్పర ప్రసాద రావు గాడిపల్లి భాస్కర్ లు మీడియా సమాశం లో మాట్లాడుతూ 2004 నుండి ఇప్పటికీ 4 దఫాలుగా ప్రతాప రెడ్డి ప్రజలు తిరస్కరించారన్నారు. ఇప్పుడు అధికార పార్టీలో చేరి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.మర్కుక్ మండలం లో ఇంటింటి ప్రచారం చేస్తుండగా ప్రతి ఒక్కరూ ఈటల కే ఓటు వేస్తామని అంటున్నారని తెలిపారు.
ఓటు వేయకపోతే నీరు, బిసిబందు, పెన్షన్లు, ఇవ్వమని బిఆర్ ఎస్ వారు బెదిరిస్తున్నారని అది రాజ్యాంగ విరుద్ధం అన్నారు. బిఆర్ ఎస్ వారు కుటుంబ పాలన, అహంకారపూరిత పాలన చేస్తున్నారనీ అది పోవాలంటే ఈటెల రాజేందర్ గెలుపొందాలని అన్నారు.ముఖ్యమంత్రికి కెసిఆర్ అయ్యాక గజ్వేల్ లో 5 వేల ఇండ్లు ఇస్తామని హామీనిచ్చారు. కానీ ఇప్పటికీ ఏ ఒక్కరికీ ఇవ్వలేదనీ ఎం మోహం పెట్టుకొని గజ్వేల్ లో ఓట్లు అడుగుతారని అన్నారు.హుజూరాబాద్ లో చేసిన సేవను చూసే బై ఎలక్షన్ లలో ఆయనని హుజూరాబాద్ ప్రజలు గెలిపించుకున్నారని గజ్వేల్ లో పునరావృతం అవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.మనికొండ కాంతారావు మేము గత 30 సంవత్సరాలుగా శిష్యులమేనని,కేసీఆర్ నా మాట వినడం లేదు, మీరు వెళ్లి ఈటలతో కలిసి ఆ పార్టీలో చేరి ఈటల గెలుపుకు కృషి చేయండి అని ఆయన చెప్పాకే అలా చేసామనీ అయనకు ఎం స్వంత లాభం జరిగిందో తెలియదు ఇప్పుడు గజ్వేల్ ప్రజలను మోసం చేసిన కెసిఆర్ పంచన చేరాడన్నారు.కానీ ఇప్పుడు అదే కాంతారావు కేసీఆర్ నామినేషన్ లో పాల్గొనడం
బాధాకరమాన్నారు.గజ్వేల్ లో ఏర్పాటు చేసిన 150 పడకల ఆసుపత్రిని గజ్వేల్ కు సంబంధించిన సిబ్బందిని కాకుండా సిద్దిపేట కు చెందిన సిబ్బంది పెట్టుకున్నారనీ నలభై ఏళ్ల నుండి8 ఖాస్తు చేకుంటున్న ఎన్నో ఎకరాల భూమిని ప్రభుత్వానికి అవసరం లేకున్నా అన్ని భూములను గుంజుకున్నారనీ,మళ్లీ ప్రజలు కేసీఆర్ కు ఓటు వేస్తే ఒక్క గుంట భూమి లేకుండా గుంజుకుంటారని అన్నారు.దుబ్బాకలో టిఆర్ఎస్ పై రెబల్ గా పోటీ చేసిన వ్యక్తిని ఈ రోజు కేసీఆర్ తన పక్కన పెట్టుకొని నామినేషన్ వేశారనీ ఆయనను పార్టీ ఎందుకు సస్పెండ్ చేయలేదు చెప్పాలన్నారు.ప్రజలను నిర్బంధించి ఇద్దరు ద్రోహులకు కలిసి వచ్చి కెసిఆర్ నామినేషన్ వేసి వెళ్ళిపోయాడనీ,ఈటల రాజేందర్ ప్రజల మధ్యన ప్రజలతో కలిసి నామినేషన్ వేశాడని ఎవరి పాలన కావలేనో గజ్వేల్ ప్రజలకు క్లారిటీ ఉందన్నారు.ప్రతాప రెడ్డి అనే వ్యక్తి
ఏ ఒక్క రోజు అయినా కేసీఆర్ తో మాట్లాడిన ఒక్క ఫోటో రిలీజ్ చేయాలని ప్రశ్నించారు.
హైజూరాబాడ్ లో, దుబ్బాకలో బిజెపి అభ్యర్థులు గెలిస్తే ఏమైనా సంక్షేమ పథకాలు ఆగాయా.గజ్వేల్ లో కేసీఆర్ పై గెలిస్తే రాష్ట్రం లో ఈటల రాజేందర్ ను సిఎం చేస్తానని మోదీ ప్రకటించారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడి పల్లి భాస్కర్ సీనియర్ నాయకులు యేళ్లు రాంరెడ్డి ,జశ్వంత్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సింగం సత్తయ్య సీనియర్ నాయకులు రాంరెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ రామచంద్ర చారి కొన్నే రాజిరెడ్డి గాడి పల్లి శ్రీనివాస్ రాజేశం వెంకట్ గౌడ్ వెంకట్ రెడ్డి నరేష్ గాడిపల్లి అనూఫ్ తదితరులు పాల్గొన్నారు.