వ్యవసాయ క్షేత్రం చుట్టూ ఓమ్ని వ్యాన్ నడిపి మార్గమధ్యలో రైతుల యోగక్షేమలు తెలుసుకున్న కేసీఆర్
సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం:
మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎర్రవల్లి గ్రామ సమీపంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రం చుట్టూ ఓమ్ని వ్యాన్ నడిపి, మార్గమధ్యలో కలిసిన రైతుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత ప్రమాదవశత్తు కెసిఆర్ ఎడమ కాలు తొంటి విరగడం జరిగింది. ఆస్పత్రిలో కాలుకు ఆపరేషన్ చేయించుకున్న అనంతరం డాక్టర్ల సూచన మేరకు ఆరు నెలలుగా కర్ర సహాయంతో నడిచారు. ఈరోజు డాక్టర్ల సూచనల ప్రకారం మ్యానువల్ గా తమ వ్యవసాయ క్షేత్రం చుట్టూ కారు నడిపారు. తమ వ్యవసాయ క్షేత్రం సమీపంలో ఉన్న పాండురంగ డ్యామ్ దగ్గరికి వెళ్లి నీటిమట్టం గమనించారు. మార్గమధ్యలో చుట్టుపక్కల ఉన్న రైతులతో ఆప్యాయంగా మాట్లాడి భూగర్భ జలాల నీటి ఎద్దడి గురించి మరియు పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫామ్ హౌస్ కు విచ్చేసిన కార్యకర్తలతో నాయకులతో ప్రేమగా మాట్లాడి, యోగక్షేమాలు తెలుసుకున్నారు. అధికారంలో లేమని అధైర్యపడవద్దని నాయకులకు కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బట్టు అంజిరెడ్డి,వేముల ప్రశాంత్ రెడ్డి,జంగిర్, తదితర నాయకులు పాల్గొన్నారు.
