రాయపోల్ మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయానికి దాతలు హుండీ బహుకరణ చేయడం జరిగిందని రాయపోల్ మాజీ ఎంపీటీసీ అహ్మదిపూర్ రాజు గౌడ్ తెలిపారు. ఆదివారం రాయపోల్ మండల కేంద్రంలో రేణుక ఎల్లమ్మ ఆలయంలో హుండీని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయపోల్ మండల కేంద్రంలో ఇటీవల నిర్వహించిన రేణుక ఎల్లమ్మ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా మోక్కుకున్న మొక్కులో భాగంగా రాయపోల్ మండల కేంద్రానికి చెందిన దుడుక రాజయ్య, గణేష్ భక్తులు రేణుక ఎల్లమ్మ దేవాలయానికి హుండీని అందజేశారు. ఈ సందర్భంగా దుడుక రాజయ్య, దుడుక గణేష్ లను గౌడ సంఘం ఆధ్వర్యంలో సన్మానం చేసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ గౌడ సంఘం సభ్యులు అహ్మదిపూర్ రాజు గౌడ్, మాదాస్ నవీన్ గౌడ్, మదాస్ పెంటా గౌడ్, మాదాస్ మురళి గౌడ్, మాదాస్ నర్సా గౌడ్, మాదాస్ బాల్ లింగం గౌడ్, అహ్మదిపూర్ వెంకట్ గౌడ్, అహ్మదిపూర్ శ్రీనివాస్ గౌడ్, మాదాస్ రాజు గౌడ్, మాదాస్ కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.