చేబర్తి గ్రామంలో శిధిలావస్థలో ఉన్న బొడ్రాయిని గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి పున ప్రతిష్ట చేశారు.
సిద్దిపేట జిల్లా జూన్ 23
మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో శిధిలావస్థలో ఉన్న బొడ్రాయిని గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి పున ప్రతిష్ట చేశారు. శివ సత్తులతో,బైండ్ల పంబాల, మధ్య గ్రామ పెద్దలు, పురోహితులు పంచామృత అభిషేకం చేసి కొబ్బరికాయలు కొట్టి గ్రామస్తుల సమక్షంలో బొడ్రాయి కి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.
అనంతరం గ్రామ పెద్దలు,గ్రామస్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగా పడి రైతులు బాగుండాలని గ్రామదేవతలను వేడుకున్నారు.
గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గ్రామ నడి బొడ్డున శిధిలావస్థలో ఉన్న బొడ్రాయిని పునప్రతిష్ట చేయడం జరిగిందని అన్నారు.
గ్రామంలో ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో ఉండాలని గ్రామ పెద్దలు, గ్రామస్తులకు సూచించారు గ్రామ ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా ఉండాలని గ్రామ దేవతలకు కొబ్బరికాయలు కొట్టి వేడుకున్నారు.
ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ ఎర్ర బాగు అశోక్,మాజీ ఉపసర్పంచ్ గుర్రాల స్వామి, ఒంటిమామిడి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బబ్బురి రాందాస్ గౌడ్,మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ బబ్బురి రాములు గౌడ్,గ్రామ రైతు సమన్వయ మాజీ కోఆర్డినేటర్ జాలని బాల్ నర్సయ్య,గ్రామస్తులు గ్యార మల్లేశం,పోయిల మల్లేశం,ర్యాకం యాదగిరి,తోట గంగాధర్,గ్యార శ్రీశైలం,షమ్మని వెంకటేష్,కొంతం శ్రీను,గందమల చంద్రం,తోట సత్తయ్య, గ్యార బాల్ నర్సయ్య, తోట కిస్టులు, కుమ్మరి నర్సింలు,మంగలి రాములు,జయరాం,తోట ఆంజనేయులు,తోట బాలకృష్ణ, బబ్బురి నర్సింలు, కీర్తి రాంబాబు, షమ్మని నర్సింలు, లింగని నర్సింలు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.





