ప్రాంతీయం

కౌంటింగ్ సెంటర్ ను పర్యవేక్షించిన సీపీ

75 Views

*రామగుండం పోలీస్ కమీషనరేట్*

*కౌంటింగ్ సెంటర్ వద్ద పోలీస్ భద్రతను పర్యవేక్షించిన రామగుండం పోలీస్ కమీషనర్ *

*కౌంటింగ్ బందోబస్త్ విధులు నిర్వహించే అధికారులకు సిబ్బందికి పలు సూచనలు ఆదేశాలు*

పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ నిర్వహణకు భద్రత పరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎలాంటి అవాంఛనీయ అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంత వాతావరణంలో రేపు జరగబోయే ఎన్నికల కౌంటింగ్ నిర్వహణకు సంబంధించి చేయవలసిన విదుల పై పోలీస్ అధికారులు, సిబ్బంది కృషి చేయాలని రామగిరి లో పోలీస్ అధికారులకు, సిబ్బందికి బ్రీఫింగ్ సమావేశంలో పలు సూచనలు, సలహాలు, ఆదేశాలు జారీ చేసిన రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి)

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ .. కమీషనరేట్ వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ విధుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. విధుల్లో ఎటువంటి అలసత్వం ప్రదర్శించవద్దన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ప్రశాంతంగా ముగిసేలా నిబద్దత తో విధులు నిర్వహించాలని సూచించారు. అధికారులు తమ వద్ద ఉన్న సిబ్బంది పూర్తి సమాచారం తెలిసి ఉండాలని, తమకు అప్పగించిన విధులపై రోల్ క్లారిటీ ఉండాలని సూచించారు.

అనంతరం కౌంటింగ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన భద్రత ఏర్పాట్లు పరిశీలించారు. కౌంటింగ్ సెంటర్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ట్రాఫిక్ డైవర్షన్ పై అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి చేతన ఐపిఎస్., గోదావరిఖని ఏసిపి రమేష్ పెద్దపల్లి ఏసి బిజీ కృష్ణ స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు, ట్రాఫిక్ ఏసిపి జాడి నరసింహులు, సీఐ లు, ఎస్ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్