ప్రాంతీయం

మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు – ఎస్ఐ రఘుపతి

57 Views

గ్రామాలలో అనుమతులు లేకుండా మద్యం అమ్ముతున్నారని రాయపోలు ఎస్సై రఘుపతి అన్నారు. రాయపోల్ మండల పరిధిలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన లింగగారి నరేష్ తన కిరణ షాపులో ఎటువంటి అనుమతులు లేకుండా మద్యం అమ్ముతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు మంగళవారం రోజున రాయపోల్ ఎస్సై రఘుపతి, సిబ్బందితో కలిసి కిరాణా దుకాణాన్ని తనిఖీ చేయగా అక్రమంగా నిల్వ ఉంచిన 11,259/- రూపాయల విలువగల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆయన అన్నారు. అక్రమంగా మద్యం అమ్ముతున్నందుకు గాను కేసు నమోదు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7