(తిమ్మాపూర్ ఏప్రిల్ 14)
తిమ్మాపూర్ మండల కేంద్రంలోని గౌడ, అంబేద్కర్ సంఘల ఆధ్వర్యంలో ఎల్లమ్మ బోనాలు అదివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గౌడ కులస్తులు మాదిగ కులస్తులు మహిళలు ఇంటికో భోనం చేసి మహిళాలు నెత్తిపై భోజనంతో డప్పు చప్పుళ్లతో శివసత్తుల పూనకాలతో నుత్యాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు.పిల్లా పాపాలను పంటలను చల్లగా చూడు అని తల్లి అని ప్రత్యేక పూజలు చేశారు. తిమ్మాపూర్ గ్రామంలో ప్రతి సంవత్సరం వేసవికాలంలో నిర్వహించే ఈ ఎల్లమ్మ బోనాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటామని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు బాగుండాలని ఉగాది తర్వాత ఈ బోనాల నిర్ణయించుకున్నామని నాయకులు తెలిపారు .
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.