ఆధ్యాత్మికం

రాజన్నను దర్శించుకున్న మండలి డిప్యూటీ చైర్మన్

86 Views

– ఆలయంలో స్వామివారికి పూజలు

వేములవాడ, ఫిబ్రవరి 16, 2024:
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ సతీ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు.. మండలి డిప్యూటీ చైర్మన్ దంపతులకు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ నాగిరెడ్డి మండపంలో అర్చకులు ఆశీర్వచనం చేసి, శేష వస్రము కప్పారు. ఆలయ పర్యవేక్షకులు తిరుపతి రావు, లడ్డు ప్రసాదం అందజేశారు. ఇక్కడ ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7