తెలుగు 24/7 న్యూస్ (నెల్లికుదురు ప్రతినిధి) ఏప్రిల్ 06
నెల్లికుదుర్ మండల కేంద్రంలోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో రైతు దీక్ష కార్యక్రమంలో
పాల్గొన్నమహబూబాబాద్ మాజి శాసన సభ్యులు బానొత్ శంకర్ నాయక్
మాజి మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని రైతుల కష్టాలు చూసిన మాజి సీఎం కేసిఆర్ కన్నీళ్ళ పర్యంతము అయ్యారు.రైతులు కాంగ్రెస్ పాలనలో అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. సాగునీరు అందక నియోజకవర్గంలోని ఎండిపోయిన పంటలకు సరిపడా నీళ్లు అందించాలి. గతంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా దెబ్బతిన్న మిర్చి, ఇతర పంటలకు నష్టపరిహారం కింద 25000 రూపాయల చెల్లించాలి. వరి, మొక్కజొన్న పంటలతో పాటు ఇతర పంటలకు ఎన్నికలలో ఒప్పుకున్న ప్రకారం క్వింటాల్ కు 500 రూపాయలు బోనస్ అదనంగా చెల్లించాలి.కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు, 2,00,000 రుణమాఫీ, రైతు బీమా, రైతుబంధు, కౌలు రైతును ఆదుకోవాలని అన్నారు.
జెడ్ పి టి సి శ్రీనివాస్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, ఎంపిపి ఎర్రబెల్లి మాధవి, పరిపాటి వెంకట్ రెడ్డి, యాదగిరి రెడ్డి, శ్రీనివాస్, భారాస నాయకులు మరియు తదితరులు ఉన్నారు.
