తెలుగు 24/7 న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) ఎప్రిల్ 06
భారతీయ జనతాపార్టీ ( బీజేపీ) 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.బిజేపి తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో బిజెపి పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ పూసాల శ్రీమాన్ ముఖ్య అతిథిగా హాజరై బిజెపి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అటల్ బిహారీ వాజపేయి,లాల్ కృష్ణ అద్వాని నాయకత్వంలో 1980లో ఏప్రిల్ 6 న బిజెపి ఆవిర్భావం జరిగింది అని,అతి తక్కువ సమయంలో దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించి నేడు 14 కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలో అతి పెద్ద పార్టీగా బిజెపి ఎదిగింది అని తెలిపారు.మిత్ర పక్షాలతో కలిపి దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని,303మంది పార్లమెంటు సభ్యులు,మిత్ర పక్షాలతో కలిపి 343 మంది ఎంపిలతో నరేంద్ర మోడి నాయకత్వంలో కేంద్రంలో బిజెపి అధికారంలోకి ఒన్ సాగుతుంది అని తెలిపారు.ఇప్పటికే వరుసగా రెండు పర్యాయాలు విజయవంతంగా పూర్తి చేసి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రాబోతుంది తెలిపారు.ధేశం ఫస్ట్ పార్టీ నెక్స్ట్అంటూ ధేశ హితం కోసం పని చేసే ఏకైక పార్టీ బిజెపి అని తెలిపారు.సభ్ కా సాత్ సభ్ కా వికాస్ అనే నినాదంతో సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం క్రృషి చేస్తున్న పార్టీ అని తెలిపారు.వరంగల్ పార్లమెంటు అభ్యర్థి అరూరి రమేష్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి ప్రదాని నరేంద్ర మోడికి కానుకగా అందించేందుకు బిజెపి శ్రేణులు శక్తివంచన లేకుండా కృషి చేయాలి అని పిలుపునిచ్చారు.అనంతరం జాతీయ పార్టీ పిలుపు మేరకు బూత్ కమిటీ సభ్యులు,అద్యక్షులు,రాష్ట్ర, జిల్లా,మండల,శక్తి కేంద్రం ఇంచార్జీలు,మండలంలోని వివిధ మోర్చాల భాద్యులు అందరూ కలిసి టిఫిన్ బైఠక్ లో పాల్గొని బూత్ వారీగా సమీక్ష, ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర, జిల్లా, మండల, శక్తి కేంద్రం ఇంచార్జీలు, వివిధ మోర్చాల భాద్యులు, బూత్ కమిటీ అధ్యక్షులు కిన్నెర యాదగిరి, మంగళపళ్ళి యాకయ్య,గడల శేఖర్, గట్ల భరత్, కాగు నవీన్, గంధం రాజు, సిహెచ్.విజయ్ కుమార్, శ్రీనివాస్ చారి, పప్పుశెట్టి సంతోష్, శీలం శ్రీనాథ్, నడిగడ్డ సందీప్, శ్రీనివాస్, కుమ్మరికుంట్ల శివ, హరీష్, విష్ణు వర్థన్ చారి,రాజ్ కుమార్, శివసాయి తదితరులు పాల్గొన్నారు.




