ప్రాంతీయం

దిష్టిబొమ్మల దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు…

210 Views
.        ముస్తాబాద్, జూలై14 కొండాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంతరాజు ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి అధ్యక్షతన కెసిఆర్, కేటీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ రుణమాఫీ అందించడంలో బిఆర్ఎస్ ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏక కాలంలో రుణాలు మాఫీతో పాటు సబ్సిడీపై రైతులకు పనిముట్లు అందించి రైతులకు మామిడి మొక్కలు వివిధ పంటలకు ఎరువులతో పాటు ఉచిత కరెంటు డ్రిప్ ఇరిగేషన్ ఉపాధి లేని వాళ్లకు ఉపాధి కల్పించి మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీనే అని గుర్తించుకోవాలి అన్నారు అదేవిధంగా ఇరు రాష్ట్రాల మధ్య తజ్జనభజన సాగుతుండగా గత 57 సంవత్సరాలకు పైచిలుకు పోరాడుతున్న తెలంగాణ ప్రభుత్వం ఎంతోమంది ఆత్మ బలిదారులవుతున్నాయని ఇకనుండి గొడవలు కాకుండా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియమ్మని గుర్తు చేసుకోవాలన్నారు. రైతుకు లక్ష రూపాయల రుణమాఫీ చేయలేని బిఆర్ ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వంమని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. అలాగే వారు చెబుతున్న  ఉచిత 24 గంటల విద్యుత్ ఇవ్వడంపై జీవన్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విసిరిన సవాలును ఎందుకు స్వీకరించట్లేదు అన్నారు. ఇప్పటికైనా అనవసర ఆరోపనలను మాని ఉన్న ఈమూడు నెలల సమయంలో రైతులకు మేలు చేసే పనిని చేయండి అని హితవు పలికారు. ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్ బషీరుద్దీన్, పెండ్యాల నారాయణ రెడ్డి, వంగ మోహన్ రెడ్డి, అగుల్ల రాజం, కనిమేని శ్రీనివాస్, క్యారం రాజు, కమ్మరి శ్రీనివాస్, యారటి భరత్, గంత సాయికుమార్, బంటు దేవేందర్, వేంకట వినయ్, కుడుదుల శ్రీకాంత్, బరిగేలా ధనుష్, ఏక్రమోద్దిన్, కుడుదుల లింగయ్య, యారటి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *