ముస్తాబాద్, ఏప్రిల్ 2 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలోని శ్రీ మాడేలేశ్వర ఆలయ ప్రతిష్ట ఉత్సవాల నేపథ్యంలో గతనాలుగు రోజుల నుండి పూజలు నిర్వహిస్తూ అదే తీరుగా రజక సామాజిక వర్గం మహిళలు డప్పు వాయిద్యాల మధ్య పోచమ్మ బోనాలతో నేత్రపర్వంగా అత్యంత వైభవపేతంగా శోభయాత్ర నిర్వహించారు. అనంతరం గ్రామదేవతలకు పోచమ్మకు బోనాలను సమర్పించి తమ మొక్కలు మొక్కుకున్నారు. గ్రామంలో మా కుటుంబాలు ఆయురారోగ్యాలతో ఉండి పాడిపంటలు సమృద్ధిగా విలసిల్లాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు మిడిదొడ్డి సారయ్య, ఉపాధ్యక్షులు దీటి బాలయ్య, కోశాధికారి దీటి సత్తయ్య, కార్యవర్గ సభ్యులు కొత్తపెళ్లి అంజయ్య, దీటి రాములు, పొన్నం బాలరాజు, తెర్లమద్ది యాదగిరి, దీటి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
