ప్రాంతీయం

వేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి

96 Views

వేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి

క్షేత్ర స్థాయిలో ఇబ్బంది లేకుండా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలి

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

టీ ఎస్ 24/7 తెలుగు న్యూస్ ఎల్లారెడ్డిపేట మార్చ్-28:

ఈ వేసవిలో నీటి సరఫరాలో అంతరాయం లేకుండా, క్షేత్ర స్థాయిలో సమస్యలు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.

గురువారం వీర్నపల్లి మండల కేంద్రం, వన్ పల్లి గ్రామాల్లో అదనపు కలెక్టర్ పి.గౌతమి తో కలిసి కలెక్టర్ పర్యటించారు. వేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా చేపడుతున్న ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

వీర్నపల్లి మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో ఇంటింటికీ తిరిగి నీటి సరఫరాలో సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ట్యాంకుల ద్వారా ఎంత నీటిని సరఫరా చేస్తున్నారు..? ట్యాంకుల ద్వారా కాకుండా బోరు ద్వారా నీటిని సరఫరా చేయడానికి అవకాశం ఉందా అనే వివరాలను ఆరా తీశారు. అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని అన్నారు.

ఎట్టి పరిస్థితుల్లో వేసవిలో నీటి సమస్యలు లేకుండా చూడాలని అన్నారు. ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని, క్లోరినేషన్ చేయాలని అన్నారు.

అనంతరం వన్ పల్లి గ్రామంలో పర్యటించిన కలెక్టర్ మిషన్ భగీరథ సరఫరాలో అంతరాయం కలిగితే వెంటనే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు నిర్ధిష్టమైన కార్యాచరణ రూపొందించాలని అన్నారు. ఇంటింటికీ తిరిగి గృహిణులను అడిగి నీటి సరఫరా గురించి అడిగి తెలుసుకున్నారు.

తదనంతరం వన్ పల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో గల పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్, అదనపు కలెక్టర్లు తనిఖీ చేశారు. ఎంఏఎఫ్ (మినిమమ్ ఆస్యూర్డ్ ఫెసిలిటీస్) లో భాగంగా పోలింగ్ కేంద్రంలో అన్ని వసతులు సక్రమంగా ఉన్నాయా లేవా అనే విషయాలను పరిశీలించారు.

చివరగా గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఎన్ని రకాల మొక్కలను పెంచుతున్నారు? అనే వివరాలను పంచాయితీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. మొక్కలన్నీ వంద శాతం బ్రతికేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు.
అనంతరం కంపోస్ట్ షెడ్ ను పరిశీలించారు. చెత్తను వేరు చేసే విధానాన్ని పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు.

ఈ పర్యటనలో జిల్లా పంచాయితీ అధికారి వీరబుచ్చయ్య, మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ విజయ్ కుమార్, ఎంపీడీఓ సత్తయ్య, తహశీల్దార్ ఉమారాణి, ఎంపీఓ నరేష్, తదితరులు ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7