మార్చ్ 18,24/7 తెలుగు న్యూస్ :బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన రిటైర్డ్ ఐపీఎస్, తెలంగాణ బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ కి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు పెద్ద ఎత్తున బీఎస్పీ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.