నేరాలు

కరెంట్ షాక్ తో చేపలు పట్టిన వ్యక్తులపై కేసు నమోదు రిమాండ్

629 Views

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామ శివారులో గల రాపల్లి వాగులో ఈనెల 16వ తారీఖున విద్యుత్ వైర్ తో కొందరు వ్యక్తులు చాపలు పట్టడానికి చూసి రాచర్ల గొల్లపల్లి కి సంబంధించిన వ్యక్తి ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా శివరాత్రి శ్రీనివాస్, కుంచం పరశురాములు, శివరాత్రి మల్లేష్ అను వడ్డెర కులస్తులైనటువంటి ముగ్గురిపై ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఎస్సై రమాకాంత్ సిరిసిల్ల కోర్టుకు రిమాండ్ కు తరలించగా సిరిసిల్ల కోర్టులో పై ముగ్గురికి జ్యూడిషియల్ రిమాండ్ విధించి ముగ్గురిని కరీంనగర్ జైలుకు తరలించడం జరిగిందని ఎస్సై రమాకాంత్ తెలిపారు అలాగే ఎల్లారెడ్డిపేట మండలంలో ఎవరైనా కరెంట్ షాక్ ద్వారా అడవి జంతువులను గాని చేపలను పట్టడం గానీ మరే ఇతర కారణాల కు విద్యుత్ వలయాలు ఏర్పాటు చేసినట్లు మా దృష్టికి వస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఎస్సై రమాకాంత్ మీడియాతో తెలిపారు

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7