నేరాలు

అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులైన బాధితురాలికి ఆర్థిక సాయం

101 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 10)

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలోని సాకలి బుచ్చమ్మ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
ఇంట్లో ఉన్న సామాగ్రి, అల్మారి లో ఉన్న దుస్తులు,కష్టపడి దాచుకున్న డబ్బులు దగ్ధమయ్యాయి.సుమారు వీటి విలువ 3 లక్షలు నుండి 4 లక్షల మధ్యలో ఉంటాయి. ఈ ప్రమాదం వల్ల బాధితురాలు నిరాశ్రయులయింది. ఈ విషయం తెలుసుకున్న బిజేపి సీనియర్ నాయకులు తాడురీ మహేష్ గౌడ్, మర్కుక్ మండల మాజీ ఎంపీటిసి రాంరెడ్డి బాధితురాలికి 5000 రూపాయల ఆర్ధిక సాయం అందజేశారు. వీరి వెంట కొత్వాల్ రాజు, లెంకల సురేష్, శర్ధని మహేష్, రాజం గారి మహేష్, అక్కారం స్వామి, మొద్దు అనిల్, ఉప్పరి మురళి, అకారం హరికృష్ణ, మునిగడప నరేష్, సిల్వరి బబ్లు గౌడ్ ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్