ప్రాంతీయం

నాగరాజు వైద్య ఖర్చులు ప్రభుత్వం నుంచి ఇప్పిస్తాం

212 Views

నాగరాజు వైద్య ఖర్చులు ప్రభుత్వం నుంచి ఇప్పిస్తాం

ప్రె‌స్ అకాడమీ చైర్మన్ తో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో మాట్లాడుతా

టియూడబ్ల్యూజే ఐజెయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాండూరు కరుణాకర్,

చేపూరి నాగరాజు ను పరామర్శించిన కరుణాకర్ యూనియన్ ప్రతినిధులు

ఎల్లారెడ్డిపేట మార్చి 10 ;

ఎల్లారెడ్డిపేట మండల ప్రజాతంత్ర విలేఖరి చేపూరి నాగరాజు గుప్తా క్యాన్సర్ వ్యాధి సోకి చికిత్స పొందుతున్న అతనికైన వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీ నివాస్ రెడ్డి, ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ తో మాట్లాడి ప్రభుత్వం నుంచి ఇప్పిస్తామని టియూడబ్ల్యూజే ఐజెయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాండూరు కరుణాకర్ తెలిపారు,
నిరుపేద కుటుంబానికి చెందిన నాగరాజు క్యాన్సర్ చికిత్స కోసం ఇప్పటికే 25 లక్షల రూపాయల వరకు ఖర్చులు పాలయ్యాడని ఇంకా చికిత్స పొందుతున్నారని ఆయన కుటుంబానికి యూనియన్ అండగా వుంటుందని కరీంనగర్ ఉమ్మడి జిల్లాల , రాజన్న సిరిసిల్ల జిల్లా యూనియన్ తో సభ్యులతో మాట్లాడి ఆర్థిక సహాయం చేయడానికి కృషి చేస్తామన్నారు,
ఈ సందర్భంగా
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రదాన కార్యదర్శి కాంబోజూ ముత్యం మాట్లాడుతూ నాగరాజు గుప్తా త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నారన్నారు,
నాగరాజు ను పరమర్షించడానికి జాతీయ కౌన్సిల్ సభ్యులు మారుతి, జిల్లా ప్రదాన కార్యదర్శి కాంబోజూ ముత్యం ,
జిల్లా కోశాధికారి గంగు సతీష్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎండి మజీద్, గౌరవ సలహాదారు బండారి బాల్ రెడ్డి, ఇ సి మెంబర్ కట్టెల బాబు, కోశాధికారి కందుకూరి రవి, ప్రతినిధులు కోండ్లేపు జగదీశ్ , శ్రీ రామోజు దేవరాజు ,చంద్రమోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చేపూరి రాజేశం తదితరులు పాల్గొన్నారు,

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7