నేరాలు

మిత్తి మీద మిత్తి.మెడ మీద కత్తి..?

156 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జోరుగా వడ్డీవ్యాపారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వడ్డీవ్యాపారం ముడుపువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది.ఏకంగా పోలీసు యంత్రాంగంనకు సంబంధించి టాస్క్ పోర్స్,ఇంటలిజెన్స్ తదితర విభాగాలు ఉన్న చోట వ్యాపారం జోరుగా సాగుతోంది.వెయ్యి రూపాయలు అసలు ఇస్తే దానికి 17 రూపాయల నుండి 20 రూపాయల వరకు వడ్డీ రూపంలో తీసుకుంటున్నారు.అసలు మొత్తం ఇచ్చే సమయంలో మిత్తి మొదటే కట్ చేసుకుని మిత్తితో సహా అసలు రూపకంగా అప్పుపత్రం రాయించుకుంటున్నారు. దీంతో మూడు నెలల కాలానికి అసలు మిత్తి కింద రాయించుకుని కట్టకుంటే వేధింపులకు గురిచేస్తున్నారని పలువురు తెలిపారు.గత రెండు సంవత్సరాల క్రితం ఇదే పద్దతిలో వడ్డీవ్యాపారుల వద్ద అప్పు తీసుకున్న ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వీరి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు.ఇప్పటికైనా పోలీసులు వడ్డీవ్యాపారం పై దృష్టిసారించాలని కోరుతున్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7