ఆసియా ఖండం లోనే అతిపెద్ద గిరిజన జాతరకు విద్యాసంస్థలకు సెలవును ప్రకటించాలి డిమాండ్ : కంచర్ల రవి గౌడ్ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు. భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ అధ్వర్యంలో లో విలేకర్ల సమావేశం గురువారం ఏర్పాటు చేయడం జరిగింది.
కార్యక్రమంలో కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన *‘సమ్మక్క సారక్క మేడారం జాతర’* ఈ సంవత్సరం ఫిబ్రవరి 21 నుంచి 24 వ తేదీ వరకు జరగనున్న ఈ జాతర కు విద్యాసంస్థ లకు సెలవులు ప్రకటించాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే అతి పెద్ద తెలంగాణ కుంభమేళా కి విద్యార్థులకు సెలవులు ఇవ్వక పోవడం తో విద్యార్థులు వారి కుటుంబాలు ఈ జాతరకు వెళ్ళలేక పోతున్నారు దీనిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు సెలవు దినాలు ప్రకటించాలి అని వారు కోరడం జరిగింది. ఈ పండుగ భారతీయ సంస్కృతి విలువలు మరియు సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది అని సమ్మక్క, సారక్కల జీవితాలు స్ఫూర్తిదాయకం అన్యాయాలకు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వారు సాగించిన పోరాటం నేటికీ ఆదర్శంగా నిలుస్తుంది. అని ముఖ్యమంత్రి గారు గిరిజనుల పట్ల గిరిజనుల జాతర పట్ల ఎంత ప్రేమ వున్నదో చెప్పకనే చెప్పడం జరుగుతుంది అని ఇప్పటి కి అయిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్య సంస్థ లకు సెలవులు ప్రకటించాలని. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది.
