ప్రాంతీయం

రాజ్యాంగ స్ఫూర్తి పురస్కార అవార్డు గ్రహీతలకు సన్మానం

104 Views

73వ రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని దిశా సేవా సంస్థ, బహుజన గళం పత్రిక సంయుక్త ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్తలకు, సామాజిక సేవకులకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి పురస్కారం- 2022 అవార్డులు అందజేశారు. దానిలో భాగంగానే సామాజిక ప్రజా సేవకురాలు, ఇందుప్రియాల్ టీచర్ మహమ్మద్ సుల్తాన ఉమర్ మరియు రాయపోల్ ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు పుట్టరాజుకి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి పురస్కారం-2022 వచ్చిన సందర్భంగా రాయపోల్ జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి  సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జెడ్పిటిసిి లింగాయపల్లి యాదగిరి మాట్లాడుతూ సమాజాన్ని చైతన్యం చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు చేసే మహమ్మద్ సుల్తాన ఉమర్, నవతెలంగాణ జర్నలిస్ట్ పుట్ట రాజుకి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి-2022 పురస్కారం రావడం హర్షణీయం అన్నారు. వీరు మరింత బాధ్యతగా పనిచేస్తూ మరింత గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రాయపోల్ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ ఫర్వేజ్, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్, సామాజిక కార్యకర్త మహమ్మద్ ఉమర్, రాయపోల్ ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు పుట్ట రాజు తదితరులు పాల్గొన్నారు.

 

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka