జ్యోతి న్యూస్ ఫిబ్రవరి 21: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామ శివారులో గల సత్య పీర్ల దర్గా వద్ద ట్రాక్టర్ కు ఢీకొని యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు వివరాల్లోకెళ్తే బాపు సింగ్ నాయక్ తండ వీర్నపల్లి మండలానికి చెందిన భూక్య సతీష్ అనే యువకుడు వయస్సు 22 సంవత్సరాలు ఎలక్ట్రిషన్ పని చేస్తూ జీవిస్తున్నాడు పని నిమిత్తం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి వెళ్లి గొల్లపల్లి కి సంబంధించిన స్నేహితుడైన భూక్య సాయి కుమార్ ను మృతుడు అతని బండిపై ఎక్కించుకొని ఉదయం 10 గంటలకు గొల్లపల్లిలోని మిత్రుని ఇంటి వద్ద నుండి బయలుదేరి వెళ్ళగా మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ టీఎస్ 23టీ 5682 గల దాని డ్రైవర్ అలకుంట శివ గ్రామం తిమ్మాపూర్ అనే అతను అతివేగంతో ఆజాగ్రత్త గా వచ్చి బైకును ఢీకొట్టగా భూక్య సతీష్ అనే 22 సంవత్సరాల యువకుడు అక్కడికక్కడే మరణించాడు భూక్య సాయికుమార్ స్వల్ప గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు మృతుని తల్లి భూక్య మంజుల భర్త రాజు లు ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా ఎస్సై ఎన్ రమాకాంత్ ట్రాక్టర్ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు





