(తిమ్మాపూర్ ఫిబ్రవరి )
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఓ గ్రామంలో దళిత మహిళను వివస్త్రను చేసి,కంట్లో కారం కొట్టి గ్రామంలోనీ నడి బజార్లో అందరు చూస్తుండగానే చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టి చిత్రహింసలకు గురిచేసిన దుండగులపై కఠినంగా శిక్షించాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు పారునంది జలపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు…
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక దళిత మహిళను వివస్త్ర చేసి దారుణంగా కొట్టిన దుర్మార్గపు చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానాని అన్నారు.
గ్రామంలోకి వలస వచ్చి బ్రతుకుతున్న దానికి వారిపై దాస్టికంగా దాడి చేసి,ఇంతటితో ఆగకుండా మరో గ్రామానికి తీసుకువెళ్లి మహిళను చెట్టు కట్టేసి దారుణంగా కొట్టి భయభ్రాంతులకు గురిచేసి ఇంత అరాచకం చేస్తున్న ఘటన ఇప్పటివరకు బయటకు రాకుండా చేస్తు ఈ సంఘటనపై కేసు నమోదు కాకపోవడం బాధాకరం అని అన్నారు.
ఇట్టి సంఘటనను సుమోటగా తీసుకొని నిందితులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి బాధిత మహిళకు అండగా నిలవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఇట్టి సంఘటనకు కారణమైన దుండగులను ఎంతటి వారైనా ఉపేక్షించవద్దానీ వెంటనే నిందితులను అదుపులోకి తీసుకోవాలని బాధిత మహిళలకు న్యాయం జరిగే వరకూ అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అన్నారు.