రాజకీయం

మున్సిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం

254 Views

ఎంపీ ఎన్నికల తర్వాత బీఆరెస్ కనుమరుగు.

బీఆరెస్ నేతల అక్రమాల గుట్టు పై విచారణ.

ధాన్యం తరుగు డబ్బులు ఎవరి జేబులోకి వెళ్లాయి.

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.

రాబోయే పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆరెస్ పార్టీ కనుమరుగు కావడం తథ్యమని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యానించారు.

శుక్రవారం మంచిర్యాల, నస్పూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్ ల ఎన్నిక సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన సభలో ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. బీఆరెస్ కు ప్రజల్లో ఆదరణ తగ్గడంతో ఆపార్టీ నేతలు సందిగ్ధంలో పడ్డారని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడిని బీఆరెస్ నేతలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతుల నుంచి ధాన్యం తరుగు పేరుతో రైతుల నుంచి దోచుకున్న సొమ్ము ఎవరి ఖాతాలో పడిందో బీఆరెస్ నేతలు జావాబుఇవ్వాలని నిలతీశారు. డీసీఎంఎస్ లో జరిగిన అక్రమాల పుట్టను తవ్వితీస్తానని ఇప్పటికే డీలర్ షిప్ తీసుకున్న వారు డబ్బులు వాపస్ తీసుకోవాలని సూచించారు. లక్షేట్టి పేటలో గుట్టను తవ్విన ఘనాపాటి ఏ పార్టీ వాడని ప్రశ్నించారు.

స్కూల్ ఉద్యోగి చనిపోయాడని దొంగ డెత్ సర్టిఫికెట్ పొంది ఉద్యోగం పొందిన యువతి పై విచారణ జరుగుతుందని ఆమెకు సహకరించిన వారి గుట్టు బయటపడుతుందని తెలిపారు. ఉత్తర తెలంగాణ లో ఎక్కడా లేని విధంగా మంచిర్యాల పురపాలక సంఘం భవనం నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అలాగే రెండు..మూడు రోజుల్లో ఐబీ స్థలంలో మాతా శిశు ఆసుపత్రి నిర్మిస్తానని వెల్లడించారు. అలాగే రాళ్ళవాగు ఇరువైపులా కరకట్ట నిర్మాణంకు అనుమతి రాగా నిధులు మంజూరు కావాల్సి ఉందన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో మౌలిక సదుపాయాల కు నిధులు మంజూరు కానున్నట్లు తెలిపారు. గ్రామాలకు కూడా గోదావరి నీరు సరఫరాకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంచిర్యాల పురపాలక సంఘంను కార్పొరేషన్ చేసి రాష్ట్రంలో నే నంబర్ వన్ మున్సిపాలిటీ గా గుర్తింపు తెస్తానని తెలిపారు.

మంచిర్యాల లో అదనంగా రెండు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మించడానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఆసుపత్రిలో వైద్యం కోసం ప్రభుత్వం ఇచ్చే నిధులు పార్టీలకు అతీతంగా ప్రజలకు ఇస్తున్నానని ఇటీవల బీజేపీకి చెందిన ఓ వ్యక్తికి సహాయం చేశానని తెలిపారు. ప్రజల సంతోషమే నా ధ్యేయమని విశ్రాంతి లేకుండా శ్రమిస్తానని అన్నారు.

సింగరేణి ఉద్యోగాల కోసం ఆశావహుల వయోపరిమితి రెండేళ్లు పెంచాలని కోరగానే స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రేమ్ సాగర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.

సన్మానం

నూతనంగా ఎన్నికైన మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, వైస్ చైర్మన్ సల్ల మహేష్, నస్పూర్ చైర్మన్ వేణు, వైస్ చైర్మన్ రాజితలను ఎమ్మెల్యే తో పాటు ప్రజాప్రతినిధులు, ఇతరులు సన్మానించారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *