నేరాలు

జనశక్తి నక్సలైట్ల పేరుతో అమాయక ప్రజలను బెదిరిస్తే కఠిన చర్యలు

122 Views

-జనశక్తి నక్సలైట్ల పేరుతో అమాయక ప్రజలను బెదిరిస్తే కఠిన చర్యలు:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

జనశక్తి నక్సలైట్ పేరుతో ప్రజలను బయబ్రాంతులకు గురి చేస్తూ పార్టీ ఫండ్ పేరిట డబ్బులు వసూళ్ళకి పాల్పడుతున్న పోకాల సాయి అనే వ్యక్తిని కొనరావుపేట్ పోలీస్ లు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ…
సిరిసిల్ల పట్టణం సాయి నగర్ కి చెందిన పాకాల సాయి అనే వ్యక్తి ప్రభుత్వ నిషేధిత విప్లవ సంస్థ అయిన జనశక్తి అరుణోదయ సంస్థ లలో పని చేస్తున్న అని అమాయక ప్రజలను బెదిరింపులకు పాల్పడుతూ పార్టీ ఫండ్ పేరిట ప్రజల వద్ద అధిక మొత్తంలో డబ్బులు వసూళ్లకు పాలపడుతున్న పోకాల సాయికుమార్ ని కొనరావుపేట్ పోలీస్ లు అరెస్ట్ చేసి రేమండ్ కి తరలించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.

జనశక్తి నక్సలైట్ల పేరుతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ డబ్బులు వసూలుకు పాల్పడే వారి సమాచారం,జనశక్తి పెరు మీద ఎవరైనా ఫోన్ కాల్ చేసి బెదిరించే వారి సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్లో గాని జిల్లా పోలీస్ కార్యాలయంలో సమాచారం అందివ్వలని వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని,సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.

No Slide Found In Slider.

Poll not found