రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తిని అరెస్టు చేశామని ఎస్సై రమాకాంత్ అన్నారు. వేములవాడ మండలం నాంపల్లి గ్రామానికి చెందిన అంకం బాలకృష్ణ అనే వ్యక్తి సోమవారం రాత్రి ఐఓబి బ్యాంక్ ఎటిఎం, ఎస్బిఐ ఏటీఎం లు ధ్వంసం చేశాడు. అనంతరం దుర్గ మాత ఆలయ హుండీ పగలగొట్టి 3000 నగదు ఎత్తుకెళ్లాడని నేవూరి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బాలకృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
