Breaking News

ప్రజలకి మరింత చేరువగా పోలీస్ సేవలు అందిచడమే లక్ష్యంగా “ఠాణా దివస్

202 Views

ప్రజల వద్ద నుండి స్వయంగా 68 వినతులు స్వీకరించి సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని హామీ.

-రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.

జిల్లాలో గ్రామా స్థాయిలో నెలకొన్న శాంతి భద్రత సమస్యలు,ప్రజల సమస్యల పరిష్కారం, గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత చేరువగా పోలీస్ సేవలు అందిచడమే లక్ష్యంగా “ఠాణా దివస్”ప్రతి నెల మొదటి మంగళవారం రోజున ఒక పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్నాం అని అందులో భాగంగా ఈ రోజు ముస్తాబద్ పోలీస్ స్టేషన్లో ఉదయం నుండి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల వద్ద నుండి 68 అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం వెనువెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.

ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ..

ప్రజలకు మరింత చేరువగా వెళ్ళడానికి “ఠాణా దివస్” కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని,గ్రామాల్లో ఎప్పటికప్పుడు కమ్యూనిటీ పోగ్రామ్స్ నిర్వహిస్తు ప్రజలతో మమేకం అవుతూ గ్రామాలలో శాంతి భద్రతను పరిరక్షణకై కృషి చేస్తున్నామని అన్నారు..

ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వయంగా స్వీకరించి వారి సమస్యలని అడిగి తెలుసుకుని అట్టి సమస్యల పరిష్కారం కోసం అధికారులను ఆదేశించడం జరిగిందని, తమ పరిధిలో లేని సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకవెళ్తామని,సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతున్నరు.కుంటుంబ సంబంధిత సమస్యలు షీ టీమ్,సఖి సెంటర్ వారి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు..

భూ సమస్యలలో క్రిమినల్ సమస్య ఉంటే వాటిలో సంబంధించిన అధికారులకి ఆదేశాలు ఇచ్చి ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ భూములను ఆక్రమించే వారిపై క్రిమినల్ కేసులతో పాటు పిడి ఆక్ట్ నమోదు చేయాలని సూచించారు.సివిల్ సమస్యలకు సంబంధించి లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళతో అవగాహన కల్పిస్తాం అన్నారు.ఇరు వర్గాల మధ్య మధ్యవర్తిత్వం చేస్తూ సమస్యలు మేము పరిష్కరిస్తామని డబ్బులు వసూలు చేసే వారిపై మాకు ఫిర్యాదులు వస్తే చట్టపరపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు..

వివిధ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన “ఠాణా దివస్” కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులలో 57 ఫిర్యాదులపై ఎఫ్ ఐ ఆర్ చేసి కేసులు నమోదు చేయడం జరిగింది.కొన్ని ఫిర్యాదులలో ఇరు వర్గాల వారిని పిలిపించి వారి సమస్యలను పరిష్కరించామని,మహిళ కుటుంబ సంబంధిత సమస్యలని జిల్లా షీ టీమ్ ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించడాం జరిగిందని,సివిల్ సమస్యలలో కోర్టు వెళ్లాలని సూచించమని,కోర్టు ని ఏ విధంగా సంప్రదించలో లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళతో మాట్లాడి అవగాహన కల్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలోఎస్పీ అఖిల్ మహాజన్  డిఎస్పీ ఉదయ్ రెడ్డి, సి.ఐ సదన్ కుమార్,ఎస్.ఐ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *