(తిమ్మాపూర్ జనవరి 22)
తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ లోని మానకొండూర్ క్యాంపు కార్యాలయం(ప్రజాభవన్) లోకి సోమవారం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వేద పండితుల ఆశీర్వచనాలతో, సర్వమత పెద్దల ఆశీస్సులతో కుటుంబ సమేతంగా ప్రవేశించారు..
మానకొండూర్ నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు క్యాంపు కార్యాలయం వద్దకు భారీగా చేరుకొని ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీపడ్డారు.
వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన ఛాంబర్లో కొలువుదీరిన అనంతరం సర్వమత పెద్దలు ప్రత్యేక ప్రార్ధన లు జరిపి ఆశీర్వచనం చేశారు.
అనంతరం ఎమ్మెల్యే కవ్వంపల్లి మాట్లాడుతూ..
సోమవారం నుండి ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా క్యాంపు కార్యాలయం లోకే రావాలని ప్రజలకు మరింత చేరువలో ఉండి సేవలు అందించడానికి క్యాంపు కార్యాలయంలోనే ఉంటూ, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ రాజకీయాలకతీతంగా నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిర్విరామంగా పనిచేస్తానన్నారు..




