ముస్తాబాద్, డిసెంబర్ 25 (24/7న్యూస్ ప్రతినిధి) భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయ్ జయంతి (జాతీయ సుపరిపాలన దినోత్సవం) సందర్భంగా స్థానిక వివేకనంద విగ్రహంవద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యులు వాజపేయ్ ఒకరని ఆయన చేసిన కృషి వల్లనే రెండు స్థానాల నుండి మొదలుకొని 300 స్థానాలకు ఎదిగి ఒక బలమైన రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఎదిగిందని అలాగే ప్రభుత్వ పథకాలను అట్టడుగు స్థాయికి తీసుకెళ్లడంలో వాజ్పేయి కృషి ఎనలేనిదని సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మల్లారం సంతోష్ రెడ్డి , జిల్లా కార్యదర్శి మీస సంజీవ్, మండల ప్రధాన కార్యదర్శి సౌర్ల క్రాంతి, పిఎస్ ఎస్ డైరెక్టర్ ఎల్లగిరిధర్ రెడ్డి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు వరి వెంకటేష్, సీనియర్ నాయకులు రమేష్ రెడ్డి, పప్పుల శ్రీకాంత్, ఓరగంటి సత్యం, బుర్ర శీను తదితరులు పాల్గొన్నారు.
