దౌల్తాబాద్: గోమాతను ప్రతి ఒక్కరు పూజించాలని టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి మెదక్ జిల్లా ఆర్గనైజర్ లక్ష్మీనారాయణ శర్మ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి గోశాలలో కనుమ పండుగ సందర్భంగా గోశాల నిర్వాహకులు, ఆలయ కమిటీ చైర్మన్ ఆది వేణుగోపాల్ ఆధ్వర్యంలో గోమాతలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మం సంస్కృతి సాంప్రదాయాల్లో గోవు చాలా విశిష్టత కలిగినదని అంతరిస్తున్న గో సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. గోమాతకు ప్రదక్షిణ చేస్తే ముక్కోటి దేవతలకు ప్రదక్షిణలు చేసినట్లని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సభ్యులు సంగమేశ్వర శాస్త్రి, శివకుమార్, ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి పబ్బ మాధవి, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు పబ్బ అశోక్ గుప్తా, ఆర్యవైశ్య మహిళా సభ్యురాలు పద్మ, భాగ్యలక్ష్మి, విజయ, సునీత, మురికి పద్మ, విజయలక్ష్మి, నరేష్, స్వామి, వీరేష్ తదితరులు పాల్గొన్నారు….
